అమైనో ఎమరాల్డ్‌లో 80% ప్రోటీన్‌తో పాటు మీ మొక్కలకు అవసరమైన సాంద్రీకృత పోషకాలు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. జీవానికి మూలమైన ప్రోటీన్లు అమైనో ఆసిడ్ అణువులతో తయారవుతాయి. అమైనో ఎమరాల్డ్ నాణ్యమైన చేపల నుండి తీసిన మేలైన అమైనో ఆసిడ్‌ను మీ మొక్కలకు అందిస్తుంది, ఇది సుస్థిర వ్యవసాయానికి అనువైనది.
ప్రయోజనాలు:
• మొక్కల/పంటల పెరుగుదలకు అవసరమైన మంట లేని నైట్రోజన్ సమృద్ధిగా ఉంటుంది.
• ఆరోగ్యకరమైన మొక్కలకు సమానంగా అవసరమైన ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి ఇతర ప్రధాన పోషకాలు కూడా ఉంటాయి.
• క్లోరోఫిల్ సాంద్రతను పెంచి, అధిక కిరణజన్య సంయోగక్రియకు దోహదపడుతుంది.
• దిగుబడి/పండ్లు/కూరగాయల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
• పూత బాగా వస్తుంది, దిగుబడి పెరుగుతుంది మరియు ఎక్కువ లాభం వస్తుంది.
వాడకం విధానం: ఆకులపై పిచికారీ మరియు డ్రిప్ ద్వారా అందించవచ్చు.
మోతాదు: ఆకులపై పిచికారీ కోసం హెక్టారుకు 500-1000 గ్రా. వాడండి (లీటర్ నీటికి 1-2 గ్రా.). డ్రిప్ ద్వారా అందించడానికి హెక్టారుకు 1-2 కి.గ్రా. వాడండి. పూత దశ నుండి పండు పక్వానికి వచ్చే సమయంలో వాడాలి.